Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
Mission Bhageeratha | అధికారుల పర్యవేక్షణ లోపమా..? లేక కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యమా..? తెలియదు కానీ పదేపదే మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోయి తాగునీరు వృధా అవుతుండటంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
హత్నూర, అక్టోబర్ 19: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ తాగునీరందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పైప్లైన్లపై నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
గ్రామాలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ మంజీరా తాగునీటి ప్రధాన పైప్ లైన్ పై కప్పు పగిలి తాగునీరు వృధాగా పోతుంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్ బస్సు స్టేజి సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పైప్ లైన్ కు బిగించిన నీటి నియంత్రణ వాల్ పైకప్పు పగిలిపోవడంతో తాగునీరు వృధాగా పోయింది. కాగా తరచూ అదే ప్రాంతంలో లీకేజీలు అవుతుండటంతో మరమ్మత్తు పనులు నాణ్యతగా చేపట్టాలని పలువురు కోరారు.
అధికారుల పర్యవేక్షణ లోపమా..? లేక కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యమా..? తెలియదు కానీ పదేపదే పైప్ లైన్లు పగిలిపోయి తాగునీరు వృధా అవుతుండటంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. మరమ్మత్తు పనులు నాణ్యతగా చేపట్టి ఉంటే మాటిమాటికి పైప్‌లైన్ లీకేజీ కాకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

