దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం: తుమ్మల
ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయని, జలాశయాల్లో ఎక్కడా నీళ్లు లేవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తమ ప్రభుత్వం కరెంటు, నీళ్లు ఇవ్వలేదని వాపోయినా ఉపయోగం లేదని పేర్కొన్నారు. సాక్షాత్తూ భగవంతు దిగొచ్చినా నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. రైతులెవరూ పంటలు వేయొద్దని కోరారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మున్సిపాలిటీ ఎదుట ఏర్పాటుచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 11: ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయని, జలాశయాల్లో ఎక్కడా నీళ్లు లేవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తమ ప్రభుత్వం కరెంటు, నీళ్లు ఇవ్వలేదని వాపోయినా ఉపయోగం లేదని పేర్కొన్నారు. సాక్షాత్తూ భగవంతు దిగొచ్చినా నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. రైతులెవరూ పంటలు వేయొద్దని కోరారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మున్సిపాలిటీ ఎదుట ఏర్పాటుచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘తాగడానికి నీళ్లు లేవు. పశువులు చనిపోతున్నాయి. మనుషులు చనిపోతున్నారు. పంటల సంగతి వదిలేయండి. తాగడానికి నీళ్లు లేవు. మన పరిస్థితి కూడా దానికి ఎంతో దూరంలో లేదు. వచ్చే ఏడాది మళ్లీ ఈ రోజు దాకా వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పంటలు వేయొద్దు. గతంలో సుమారు 4 మీటర్లకుపైగా లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు మరో 4 మీటర్ల లోతుకు తగ్గాయి. మున్ముందు భూగర్భ జలాలు అందుబాటులో ఉండవు.
కరెంటు అంతకంటే ఉండదు. కరెంటు ఎందుకు ఉండదు అంటే.. రాష్ట్రంలోని ఏ రిజర్వాయర్‌లోకి కూడా నీళ్లు రాలేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, జూరాల వంటి ప్రాజెక్టులన్నీ నీళ్లులేక ఖాళీగా ఉన్నాయి. విద్యుత్తు ఉత్పత్తి కోసం ఏ రిజర్వాయర్‌లోనూ నీళ్లు లేవు. అదీగాక, ఇప్పుడు నీళ్లు తాగునీటికి కూడా సరిపోవు. నాగార్జునసాగర్‌లోని నీళ్లు పాలేరు జలాశయానికి రావాలన్నా తగినన్ని లెవెల్స్ లేవు. అందుకని దయచేసి రైతులెవరూ పంటలు వేయొద్దు. మంచినీళ్లకు ముందు చూడండి. లేకపోతే చాలా తీవ్రమైన కష్టాలుంటాయి. పంటలేసే రైతులకు మరీ మరీ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

