ఊరూవాడ చేరి..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాల
తీరొక్క పువ్వుతో ఉయ్యాలో
రంగు రంగు పూలపండగ ఉయ్యాలా
ఇంటింటా సందడే ఉయ్యాలో
ఉత్సాహం తెచ్చింది ఉయ్యాల
//బతుకమ్మ //
ప్రకృతి ఒడిలోన ఉయ్యాలా
పూల బతుకమ్మ సందడి ఉయ్యాల
తంగేడు, చామంతి, ఉయ్యాలో
గన్నేరు, గుమ్మడి పూలతో ఉయ్యాల
అందాల బతుకమ్మ ఉయ్యాల
మెరిశాయి అందంగా ఉయ్యాలా
బంగారు రంగు రంగు పూల ఉయ్యాలా
// బతుకమ్మ //
ఊరూవాడ చేరి ఉయ్యాలో
నైవేద్యాలు పెట్టి ఉయ్యాలా
పసుపు, కుంకుమ ఇచ్చి ఉయ్యాలో
ఆటలు ఆడారు ఉయ్యాలో
పాటలే పాడారు ఉయ్యాలా
// బతుకమ్మ //
ముదితలందరూ కూడి ఉయ్యాలో
నవరాత్రులు కొలిచారు ఉయ్యాలా
ఆడుతూ పాడుతూ ఉయ్యాలో
గౌరమ్మను పంపారు ఉయ్యాలా
భక్తితో పూజించే ఉయ్యాల
సిరిసంపదలిచ్చి ఉయ్యాలో
చల్లంగా దీవించు ఉయ్యాల
చల్లంగా దీవించు ఉయ్యాల
//బతుకమ్మ//
టీవీ . మాణిక్యలక్ష్మి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

