మా జీవితాలు ఆగం చేయొద్దు.. డిండి-నార్లాపూర్ జలాశయ భూబాధితుల వేడుకోలు
రిజర్వాయర్ నిర్మాణం పేరుతో తాటి చెట్ల తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తుండ టంతో తమ జీవనాధారమైన తాటిచెట్లను తొలగిస్తే తమ జీవితాలు రోడ్డుపాలవుతాయని గీతకార్మికులు వాపోయారు. రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు చెట్లను లెక్కించి తొలగించేందుకు రావటంతో గీత కార్మికులు అడ్డుకున్నారు.
- తాటిచెట్లను తొలగిస్తే రోడ్డున పడతామని గీతకార్మికుల ఆవేదన
- భూసర్వేను అడ్డుకున్న రైతులు, గ్రామస్తులు.. ఉద్రిక్తం
రంగారెడ్డి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : డిండి-నార్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. జలాశయం నిర్మాణం కోసం భూసేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా ఈ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నామని.. ఇప్పుడు రిజర్వాయర్ నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటే మా భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాటిచెట్లు తొలగించొద్దని..
రిజర్వాయర్ నిర్మాణం పేరుతో తాటి చెట్ల తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తుండ టంతో తమ జీవనాధారమైన తాటిచెట్లను తొలగిస్తే తమ జీవితాలు రోడ్డుపాలవుతాయని గీతకార్మికులు వాపోయారు. రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు చెట్లను లెక్కించి తొలగించేందుకు రావటంతో గీత కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గీతకార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసు బందోబస్తు మధ్య జలాశయం పరిధిలో ఉన్న 74 వేప, తుమ్మచెట్లను లెక్కించారు. తాటిచెట్ల లెక్కింపు విషయంలో స్పష్టత రాలేదు. డిండి-నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ సమీపంలో రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రిజర్వాయర్ నిర్మించొద్దని..
రిజర్వాయర్ నిర్మాణంకోసం ఇర్విన్, అజిలాపూర్ తదితర గ్రామాల పరిధిలో అధికారులు భూములను సేకరిస్తున్నారు. భూసేకరణను.. రెండు గ్రామాల ప్రజలు మొదటి నుంచీ అడ్డుకుంటున్నారు. రైతులతోపాటు గీత కార్మికులూ వ్యతిరేకిస్తున్నారు. సుమారు రెండు వందలకు పైగా చెట్ల తొలగింపుతో రోడ్డున పడాల్సిన వస్తుందని గీతకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం వద్దని భూమికి భూమే ఇవ్వాలని..లేకుంటూ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ వరకు రేడియల్ రోడ్డు బాధితులకు ఇస్తున్న మాదిరిగానే పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌తో తమకు ఎలాంటి లాభం లేదని తేల్చి చెబుతున్నారు. పరిహారం విషయంలో స్పష్టత వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని అజిలాపూర్, ఇర్విన్ గ్రామాలకు చెందిన పలువురు భూబాధితులు ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
బాధితులకు కంటిపై కునుకు కరువు
ఇర్విన్ సమీపంలో నిర్మించనున్న రిజర్వాయర్‌తో నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం కంటిపై కునుకు లేకుండా చేస్తున్నది. పరిహారం విషయాన్ని తేల్చకుండానే అధికారులు పోలీస్ బందోబ స్తుతో భూములను సేకరించేందుకు వస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారంపై స్పష్టత లేకుండా ఎలాంటి పనులు చేయొద్దని రైతులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా భూసేకరణ వైపు మొగ్గు చూపుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

