ఓసీ లేకుంటే.. కరెంట్ కట్
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించి ముందస్తు ప్లాన్లు తుంగలో తొక్కి, డివియేషన్లతో సాగుతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన చర్యలకు సిద్ధమయ్యారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఈ నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన క్యూర్ చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకట్ట వేయనున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించి ముందస్తు ప్లాన్లు తుంగలో తొక్కి, డివియేషన్లతో సాగుతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన చర్యలకు సిద్ధమయ్యారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఈ నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన క్యూర్ చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకట్ట వేయనున్నారు. ఇప్పటివరకు అక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకున్నా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకున్నా, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులతో మేనేజ్ చేసుకుంటూ అడ్డదారిలో కనెక్షన్లు పొందుతున్న వ్యవస్థకు ఇకపై ముగింపు పడనుంది.
అక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే కరెంట్, వాటర్ కనెక్షన్లు మంజూరు చేసేలా, లేనిపక్షంలో వాటిని నిలిపివేసేలా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సన్నద్ధ్దమయ్యారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) లేని అక్రమ నిర్మాణాలకు విద్యుత్, డ్రైనేజీ, మంచి నీటి కనెక్షన్లను తక్షణమే నిలిపివేయడంతో పాటు సదరు ప్రాపర్టీలకు స్పాట్ రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకునేలా చర్యలు చేపట్టనున్నారు. తీవ్రమైన ఉల్లంఘనలు ఉంటే భవనాలను సీజ్ చేయడం లేదా సీఆర్ఎస్ కింద కూల్చివేసే అధికారం కల్పించనున్నారు. అప్లికేషన్ దాఖలు చేయడం, పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, నోటీసులు, అనుమతులు, చివరికి ఓసీ జారీ వరకు ప్రతి ఒక ప్రక్రియనూ పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా దళారీల ప్రమేయాన్ని శాశ్వతంగా అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఆలస్యమైతే డీమ్డ్ అప్రూవల్
అధికారుల లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులపై నిర్దేశిత సమయం (టైమ్ లిమిట్) విధించారు. అధికారి స్పందించకపోతే ఫైల్ పై అధికారికి వెళ్తుంది. కమిషనర్ స్థాయి అధికారులు కూడా 7 రోజుల్లోగా నిర్ణయం తీసుకోకపోతే, ఆటోమేటిక్‌గా డీమ్డ్ అప్రూవల్ ప్రక్రియ ప్రారంభమై, ఫీజు చలానా జనరేట్ అవుతుంది. ఫీజు చెల్లించగానే పర్మిషన్ లభిస్తుంది. అంతేకాకుండా ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా, విజిల్ లీక్ లేదా క్షేత్రస్థాయి పరిశీలనలో అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే వెంటనే స్టాప్ ది వర్ నోటీసులు జారీ చేసే పూర్తి అధికారాన్ని మున్సిపల్ అధికారులకు ఇచ్చారు. వినకపోతే కూల్చివేసి, ఆ కూల్చివేత వ్యయాన్ని కూడా భవన యజమాని నుంచే వసూలు చేసేలా చట్టంలో చేర్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

