ఖమ్మం : రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో రూ. 60.20 కోట్లతో నిర్మించిన 1,004 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కలిసి ప్రారంభించారు. టేకులపల్లిలో డబుల్బెడ్రూం గృహ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను, ప్రాథమిక ఉప కూరగాయల మార్కెట్‌ను మంత్రులు సందర్శించి వాటిని ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ నుంచి వీ.వెంకటాయపాలెం వరకు 4.4కిలో మీటర్ల నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులకు రూ.35 కోట్లు మంజూరయ్యాయి.
MA&UD Minister @KTRTRS along with Housing Minister @VPRTRS and Transport Minister @puvvada_ajay, inaugurated 1004 2BHK Dignity Houses at Tekulapally in Khammam. The Government has constructed these houses at a cost of Rs. 63 Crore. pic.twitter.com/FfSocYo2zd
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 2, 2021