హైదరాబాద్ : ప్రజా కవి కాళోజీపై ప్రభాకర్ జైని నిర్మించిన కాళోజీ డాక్యుమెంటరీ అద్భుతంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్‌కు చెందిన సినీ దర్శకుడు ప్రభాకర్ జైని నిర్మించిన ప్రజాకవి కాళోజీ డాక్యుమెంటరీని మంత్రి ఎర్రబెల్లి.. మంత్రుల నివాసంలో ఆవిష్కరించి, తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని చెప్పారు. డాక్యుమెంటరీ తీసిన ప్రభాకర్ జైనీని మంత్రి అభినందించారు.
మంత్రికి డాక్యుమెంటరీ గురించి వివరిస్తున్న ప్రభాకర్ జైని