చైన్నై : బంగాళాఖాతంలో మంగళవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.1తీవ్రతతో భూకంపం రాగా.. చెన్నైలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భూకంపం ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతంలో భూమి కంపించగా.. జనాలు భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని సోషల్ మీడియాలో టీట్లు వెల్లువెత్తాయి.
తిరువన్మియూర్, ఆళ్వార్‌పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని వచ్చినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు. భూకంపంతోనే ప్రకంపనలు వచ్చినట్లు ఐఎండీ చెన్నై శాఖ ధ్రువీకరించింది. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. భూకంపం కాకినాడకు ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, సముద్ర అలలను పరిశీలిస్తున్నామని.. ముందస్తుగా సునామీపై అంచనా వేయలేమని.. హెచ్చరికలు జారీ చేయలేమని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.
A 5.1 Mag earthquake at a depth of 10kms happened in Bay of Bengal. Some of my friends said that they felt in #Chennai
— Raj Bhagat P #Mapper4Life (@rajbhagatt) August 24, 2021
But nothing to worry about. It WON'T cause Tsunami or anything of that sort.
It is a rare intraplate earthquake and once in a while such tremors do happen pic.twitter.com/sjrnYCRiqK
Just felt the earthquake 😰😰😰 #Chennai
— Prasath (@imprasath) August 24, 2021
Felt a mild tremor in Perungudi, Chennai just a while ago… thought I was sleepy but nooo 🤯#tremor #earthquake #chennai
— Cheryl John (@cheryljohnn) August 24, 2021