పెద్దపల్లి : గణేశ్ నిమజ్జనోత్సవం ( Ganesh immersion) సందర్భంగా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వాణిశ్రీ (DMHO Dr. Vanishree) సూచించారు. గణేష్ నిమజ్జనం, సంసిద్ధత, వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి వర్చువల్‌గా వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రభలేందుకు అవకాశమున్న గణేశ్ నిమజ్జనం జరిగే ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు, జ్వరం కేసులకు డెంగ్యూ రాపిడ్ టెస్టులు చేయాలని, అందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను ఏలీసా టెస్ట్ కోసం టీ -హబ్‌కు పంపించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు బీ శ్రీరాములు, కేవీ సుధాకర్ రెడ్డి, బీ కిరణ్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.