రామాయంపేట, మార్చి 12 : అడవుల రక్షణతోపాటు సం రక్షణకు ప్రజలు సహకరించాలని రామాయంపేట ఫారెస్టు రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారి కుత్బుద్దీన్ పిలుపునిచ్చారు. శనివారం రామాయంపేట అటవీశాఖపరిధిలోని అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్, వెంకటాపూర్ (ఆర్), శివ్వాయపల్లి గ్రామాల్లో అడవుల రక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతాల్లోని పంటపొలాలు ఉన్న రైతులు పని చేసే సమయాల్లో అగ్గిపుల్లలను వాడొద్దని, మంటలు పెడితే వాటిని పూర్తిగా ఆర్పేయాలని సూచించారు. వేసవిలో ఎండల తీవ్రత అధికమని, ఈ సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అడవి పూర్తిగా కాలిపోతుందన్నారు. అటవి సంపదను కాపాడితే అది మనకు రక్షణ కవచంగా ఉం టుందన్నారు. అడవిలో అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే త మకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్ట్ బీట్ అధికారి లక్ష్మి, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కలను ఎండిపోకుండా కాపాడుకోవాలి
వేసవి కాలంలో హరితహారం మొక్కలు, నర్సరీలో పెంచు తున్న మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పట్టించాలని, లేకుంటే ఎండిపోయే ప్రమాదం ఉందని రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. వెంకటాపూర్(ఆర్), సుతారిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల ను సందర్శించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుం దని, మొక్కలకు ఉదయం, సాయంత్రం ట్రాక్టర్ ద్వారా నీళ్లు పట్టించాలన్నారు. మొక్కలు ఎండి పోతే కార్యదర్శులే బాధ్యుల న్నారు. ఎంపీడీవో వెంట టీఏ ప్రతాప్, సర్పంచ్లు సంధ్య, మహేందర్రెడ్డి, కార్యదర్శులు పద్మ, శ్యామల ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి : సర్పంచ్ రాకేశ్నాయక్
చిలిపిచెడ్, మార్చి 12 : హరితహారంలో ప్రతి ఒక్కరూ భా గస్వాములై నాటిన ప్రతి మొక్కకు నీళ్లు పడుతూ సంరక్షించాల ని సర్పంచ్ రాకేశ్నాయక్ కోరారు. గుజిరితండాలో హరితహారంలో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్ సాయంతో ప్రతి మొక్కకు నీరు పోస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని,ఇందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.