నిజాంపేట, మార్చి 8 ః అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేటతోపాటు నందగోకుల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, చెత్తబుట్టల పంపిణీ, మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శమన్నారు. మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం హర్షణీయమని, ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్వై మండ లాధ్యక్షుడు రాజు, సర్పంచ్‌లు అనూష, బాల్‌నర్సవ్వ, నర్సింహరెడ్డి, ఎంపీటీసీ లహరి, ఉపసర్పంచ్ బాబు, నిజాంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, కొండల్‌రెడ్డి, డైరెక్టర్లు కిష్టారెడ్డి, అబ్దుల్అజీజ్, స్వామిగౌడ్, మండల కోఆష్షన్ స భ్యుడు గౌస్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సం పత్, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవీందర్, నేతలు లక్ష్మీనర్సింహులు, ఎల్లం, సంతోశ్‌కుమార్, నగేశ్, రా ములు, సత్యనారాయణ, మల్లేశం, దాసు పాల్గొన్నారు.