మెదక్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘ఎస్ఐఆర్ వందశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్పై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు చేసేందుకు బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారన్నారు. మృతిచెందిన, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన, డబుల్ఓట్లు, అనర్హుల పేర్లు తొలిగిస్తున్నట్లు తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు మెదక్ జిల్లాలో 4,53,140 మంది ఓటర్లకు 4,36, 477 మందికి ఫారాలు పంపిణీ చేశామన్నారు. 96.32 శాతం ఫారాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. ‘సర్’ పై మెదక్ జిల్లాలో జరుగుతున్న తీరును కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
మెదక్ కలెక్టర్: సర్ కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో బీఎల్వోలు పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటరు ఫారాలు అందజేస్తున్నారు. ఈనెల 24వతేదీ వరకు ప్రతి ఇంటి సర్వే పూర్తి చేస్తాం. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇస్తాం. అక్టోబర్ 1వతేదీ ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రకటిస్తుం ది. జిల్లాలో ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం.
మెదక్ కలెక్టర్ : మెదక్, నర్సాపూర్ ఈఆర్వోలు సమగ్ర ఓట రు జాబితా సవరణను పర్యవేక్షణ చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో ఏడుగురు ఏఈఆర్వోలు, 28 మంది సూపర్ వైజర్లు, 278 మంది బీఎల్వోలు పని చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో 2,20,414 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో తొమ్మిది మంది ఏఈఆర్వోలు, 36 మంది సూపర్వైజర్లు, బీఎల్వోలు 308 మంది పనిచేస్తున్నారు. పురుషులు 112984 మంది, మహిళలు 120117 మంది, ఇతరులు ఏడుగురు ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 88.77 శాతం మ్యా పింగ్ పూర్తి చేశాం.
మెదక్ కలెక్టర్ :కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలిగింపు, మార్పులు, సవరణ, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ తుది ఓటరు జాబితా ప్రచురణ చేసేందుకు ఫారాలు అందిస్తున్నాం. కొత్త ఓటరు నమోదు కోసం ఫారం -6, పేరు తొలిగింపునకు ఫారం -7 , పేరు చిరునామా ఫొటో ఇతర వివరాల సవరణకు ఫారం -8 , మార్పు కోసం అవసరమైన పత్రాలు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, టెన్త్ మెమో అందించాలి. నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ , విద్యుత్ బిల్లు, రేషన్ కార్డు, బ్యాంకు పాసుబుక్ అందించాలి. కొత్త పాస్ పోర్టు సైజ్ ఫొటో ఇవ్వాలి.
మెదక్ కలెక్టర్ : మెదక్ జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా తయారు పై రాజకీయపార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాం. సర్ పై రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో వివరించాం. బీఎల్వోలు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి రాజకీయ ప్రతినిధులకు వివరించారు. రాజకీయ నాయకులు సర్ లో పాల్గొని కొత్త ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అందరి సహకారంతో మెదక్ జిల్లాలో సర్ విజయవం తం చేసేందుకు కృషి చేస్తున్నాం.
మెదక్ కలెక్టర్: గ్రామం నుంచి పట్టణాలు, ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన వారు ఓటు ఎక్కడ ఉండాలో వారు నిర్ణయం తీసుకోవాలి. రెండు చోట్ల ఓటు ఉండే అవకాశం లేదు. ఆధార్ ఆధారంగా బీఎల్వోలు పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దేశంలో ఎక్కడైనా ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి.
రమాదేవి సెల్: 9391942209
నర్సాపూర్ ఈఆర్వో
రామకృష్ణ సెల్: 9346999257