న్యూఢిల్లీ, జూలై 8: దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది యమహా మోటర్స్. ఏరోక్స్ ఎలక్ట్రిక్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ రూ.1.67 లక్షల నుంచి రూ.2.82 లక్షల లోపు లభించనున్నది. సింగిల్ చార్జింగ్‌తో 117 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద లభిస్తున్నదని పేర్కొంది. స్మార్ట్ కీ, ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టైయిల్ లైట్స్, ఏబీఎస్‌తో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రెండు 1.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 13 కిలోల అధిక బరువు వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.