కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipeta ) మండలంలోని దుబ్బగూడెంకు చెందిన సింగారావు తనూజ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్( MBBS ) సీట్ సాధించింది. సింగారావు రఘపతి- లత దంపతుల కుమార్తె తనూజ ( Tanuja ) నీట్ లో ప్రతిభ చూపింది. నీట్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ 1080 ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. తనూజ తండ్రి రఘుపతి గద్దెరాగడిలో మెకానిక్ షెడ్ నడుపుతూ కూతురును డాక్టర్ గా చేస్తుండడం పట్ల గ్రామస్థులు అభినందించారు.