కొల్లాపూర్ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు , ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ ( UTF) జిల్లా కార్యదర్శి కె.శంకర్ కోరారు. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి రెండురోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర విద్యా సదస్సు, రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలకు బయలు దేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు గత కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించు కొంటామని వివరించారు. సమావేశాల్లో ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ కోసం,ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా చర్చ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొహమ్మద్,రుక్మద్దీన్, శ్రీరామ్,సూర్యశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి కురుమయ్య,కోశాధికారి క్రాంతికుమార్, పట్టణ అధ్యక్షులు హకింకారి శంకర్, ప్రధాన కార్యదర్శి రాజేష్,మండల నాయకులు సతీష్,అంజనేయులు,బంగారయ్య, అభిలాష్, వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.