Raja Saab | టాలీవుడ్ దర్శకుడు మారుతి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో అదిరిపోయే ఇంట్రడక్షన్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. తాజాగా ప్రభాస్ ఇంట్రో సాంగ్ షూటింగ్ పూర్తయిందని.. తనకు చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు డైరెక్టర్ మారుతి.
ఫస్ట్ సింగిల్‌గా రాబోతున్న ఈ ఇంట్రో సాంగ్‌ను మారుతి టీం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న గ్రాండ్‌గా లాంచ్ చేయనుంది. రాజాసాబ్ ట్రైలర్‌ను నేడు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం ఎలాంటి విజువల్ గ్లింప్స్‌ను రెడీ చేశాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Pawan Kalyan | ఓజీ సినిమాలో పవన్ చిన్నప్పటి పాత్ర పోషించిన నటుడు ఎవరో మీకు తెలుసా?
Chiranjeevi | టీమిండియాకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు.. తెలుగు తేజంపై ప్రశంసలు
OTT | ఈ దసరాకి థియేటర్‌తో పాటు ఓటీటీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఎన్ని సినిమాలు రాబోతున్నాయంటే!