 
                                                            IND vs AUS : ఆసియా కప్ ఛాంపియన్‌గా తొలి టీ20 సిరీస్ ఆడుతున్న భారత్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. తొలి టీ20 వర్షార్పణం కాగా రెండో టీ20లో విజయంతో బోణీ కొట్లాలనుకున్న టీమిండియాకు చెక్ పెట్టింది. హేజిల్‌వుడ్(3-13) విజృంభణతో ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయగా.. ఓపెనర్ అభిషేక్ శర్మ (68), హర్షిత్ రానా(37) అర్ధ శతకంతో పోరాడగలిగే స్కోర్ అందించాడు. మిచెల్ మార్ష్(46) మెరుపులతో విజయానికి చేరువైన ఆసీస్‌ను ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(2-26) వరుస వికెట్లతో భయపెట్టాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్లో మార్కస్ స్టోయినిస్(6 నాటౌట్) రెండు పరుగులు తీయగా ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు పొట్టి సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. తొలి మ్యాచ్ వరుణుడి ఖాతాలో చేరి వన్డే సిరీస్ చేజారినా పొట్టి కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న టీమిండియాను ఆస్ట్రేలియా 130లోపు కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించిన ఆసీస్ టీ20 సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
A few hiccups towards the end, but Australia get the win with more than 6 overs to spare 💪 #AUSvIND pic.twitter.com/MWkFPEMF9a
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2025
వన్డేల్లో భారత్‌ను దెబ్బకొట్టిన జోష్ హేజిల్‌వుడ్(3-13) సంచలన బౌలింగ్‌తో టాపార్డర్‌ను కూప్పకూల్చాడు. 49 పరుగులకే ఐదు వికెట్లు పడిన వేళ ఓపెనర్ అభిషేక్ శర్మ(68), హర్షిత్ రానా(37)లు జట్టును ఆదుకున్నారు. కానీ, గ్జావియర్ బార్ట్లెట్ ఓవర్లో రానా ఔట్ కాగా.. అర్ధ శతకంతో జోరు మీదున్న అభిషేక్‌ను నాథన్ ఎల్లిస్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత శివం దూబే(4) నిరాశపరచగా బుమ్రా రనౌట్ కావడంతో టీమిండియా 125 పరుగులకే ఆలౌటయ్యింది.
టీమిండియాకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(46), మిచెల్ మార్ష్(28)లు ధనాధన్ ఆటతో స్కోర్‌బోర్డును ఉరికించారు. పవర్ ప్లే పూర్తికాకముందే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఎడాపెడా దంచేస్తున్న హెడ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ.. జోష్ ఇంగ్లిస్ (20) జతగా మార్ష్ చెలరేగిపోయి లక్ష్యాన్ని కరిగించాడు. భారీ సిక్సర్లు బాదుతున్న మార్ష్‌ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే హిట్టర్ టిమ్ డేవిడ్(1)ను వరుణ్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. అప్పటికీ విజయానికి 27 రన్స్ కావాలంతే.
Australia win the second T20I by 4 wickets.#TeamIndia will look to bounce back in the next match.
Scorecard ▶ https://t.co/7LOFHGtfXe#AUSvIND pic.twitter.com/rVsd9Md9qh
— BCCI (@BCCI) October 31, 2025
మరో వికెట్ పడకుండానే లక్ష్యాన్ని అందుకునేలా కనిపించిన ఆసీస్‌ను కుల్దీప్, బుమ్రా దెబ్బకొట్టారు. ఇంగ్లిస్‌ను కుల్దీప్ ఎల్బీగా ఔట్ చేసినా.. మిచెల్ ఓవెన్(14) క్రీజులో ఉండడంతో అతడే మ్యాచ్‌ను ముగిస్తాడని ఆతిథ్య జట్టు భావించింది .. కానీ, బుమ్రా 13వ ఓవర్లో వరుస బంతుల్లో ఓవెన్, మాథ్యూ షార్ట్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. కానీ.. బార్ట్లెట్ హ్యాట్రిక్‌ను అడ్డుకున్నాడు. ఆ తర్వాత కుల్దీప్ ఓవర్లో రెండు రన్స్ తీసిన స్టోయినిస్(6 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. మరో 30-40 రన్స్ చేసి ఉంటే.. లేదా పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇవ్వకపోయి ఉంటే కచ్చితంగా టీమిండియాకు అవకాశాలు ఉండేవి ఇరుజట్ల మధ్య మూడో టీ20 నవంబర్ 2 ఆదివారం రోజున జరుగనుంది.
 
                            