 
                                                            మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియాకు .. ఆసీస్ స్పీడ్ బౌలర్లు షాక్ ఇచ్చారు. శుభమన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగితా ఎవ్వరూ రెండు అంకెల స్కోరు చేయలేకపోయారు. ఆసీస్ స్పీడ్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తన బౌలింగ్‌తో హడలెత్తించాడు. నాలుగు ఓవర్లు వేసిన హేజిల్‌వుడ్.. 12 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓ ఓవర్లో అతను కేవలం 3 బంతుల తేడాతోనే రెండు వికెట్లను తీసుకున్నాడు. గిల్ 5, సాంసన్ 2, సూర్య ఒక పరుగు స్కోర్ చేయగా, తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు.
Running out of ways to describe Josh Hazlewood 🤩 #AUSvIND pic.twitter.com/yFUIBppvyd
— cricket.com.au (@cricketcomau) October 31, 2025
టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం తన సహజ శైలిలో చెలరేగిపోయాడు. బౌండరీలతో హోరెత్తించాడు. మెల్బోర్న్ మైదానంలో టైమింగ్ స్ట్రోక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక్కొక్కరు ఔటవుతున్నా.. అభిషేక్ మాత్రం సమయోచితంగా బౌండరీలు రాబట్టుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 10 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 69 రన్స్ చేసింది. అభిషేక్ శర్మ 45 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి.
A stunning six from Abhishek Sharma to get the MCG crowd fired up 😱 #AUSvIND pic.twitter.com/azTBA0Lsle
— cricket.com.au (@cricketcomau) October 31, 2025
 
                            