 
                                                            Jubille Hills By Poll | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిరుద్యోగ అభ్యర్థులు పోరుబాట పట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 13 మంది నిరుద్యోగ అభ్యర్థులు బరిలో దిగారు. వీరంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. నిరుద్యోగులకు ఎన్నో ఆశలు చూపి.. నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని నిరుద్యోగ అభ్యర్థులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరుద్యోగ యువతి ఆస్మా తన ప్రచారంలో దూకుడు పెంచారు. నిరుద్యోగ అభ్యర్థుల మద్దతుతో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంగిరెద్దుకైనా ఓటు వెయ్యండి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దని.. జూబ్లీహిల్స్ ఓటర్లను అభ్యర్థిస్తున్నట్లు ఆస్మా తెలిపారు. ఎందుకంటే కాంగ్రెస్ పాలన అంటే నికృష్టమైన పాలన. మళ్లీ హస్తం గుర్తుకు ఓటేస్తే హ్యాండ్ ఇవ్వడం ఖాయమన్నారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి.. టార్చ్ లైట్‌కు ఓటేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తది అని ఆస్మా తన గుర్తును ఓటర్లకు తెలియజెప్పారు.
గంగిరెద్దుకైనా ఓటు వెయ్యండి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దని.. జూబ్లీహిల్స్ ఓటర్లను అభ్యర్థిస్తున్న నిరుద్యోగ యువతి ఆస్మా https://t.co/bMBJ7AZdvo pic.twitter.com/M5A04Zumsi
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
 
                            