 
                                                            మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు 126 రన్స్ టార్గెట్ విసిరింది టీమిండియా. మెల్బోర్న్లో జరుగుతున్న రెండో టీ20(AUSvIND)లో .. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 18.4 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది. ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ల ధాటికి ఇండియన్ టాపార్డర్ విఫలమైంది. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా మాత్రమే రాణించారు. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 రన్స్ చేసి ఔటయ్యాడు. టీ20ల్లో అభిషేక్‌కు ఇది ఆరవ హాఫ్ సెంచరీ.
FIFTY!
Abhishek Sharma has been at it from the word go.
He brings up a brilliant half-century off just 23 deliveries.
His 6th in T20Is 🔥🔥
Live – https://t.co/ereIn74bmc #TeamIndia #AUSvIND #2ndT20I pic.twitter.com/5lt8x71Tmr
— BCCI (@BCCI) October 31, 2025
ఇక హర్షిత్ రాణా 33 బంతుల్లో 35 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. అభిషేక్, హర్షిత్ ఆరో వికెట్‌కు 56 రన్స్ జోడించారు. భారత బ్యాటర్లలో ఈ ఇద్దరు మినహాయి మిగితా ప్లేయర్లు ఎవ్వరూ రెండు అంకెల స్కోరు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ ఆరంభంలో దుమ్మురేపాడు. అతను 4 ఓవర్లలో 13 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. బార్ట్లెట్, ఎల్లిస్ చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.
Innings Break!#TeamIndia all out for 125 runs in 18.4 overs.
Abhishek Sharma top scored with 68 runs.
Scorecard – https://t.co/ereIn74bmc #TeamIndia #AUSvIND #2ndT20I pic.twitter.com/QnBsQCd6DX
— BCCI (@BCCI) October 31, 2025
 
                            