 
                                                            న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత , ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal)పై మళ్లీ ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన కోటాలో.. కేజ్రీవాల్ కోసం అద్దాల మేడ నిర్మిస్తున్నట్లు బీజీపీ ఆరోపించింది. 7-స్టార్ సదుపాయాలు ఆ మేడలో కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. పంజాబ్‌లో కేజ్రీవాల్ ఎమ్మెల్యే కాదు, కనీసం ప్రభుత్వంలో లేరని బీజేపీ పేర్కొన్నది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనిపై ఆరోపణలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన ఆమ్ ఆద్మీ నేతలు పంజాబ్‌లోని వివిధ బోర్డులు, కమీషన్లలో చోటు సంపాదించినట్లు ఆరోపించారు. అద్దాల మేడ నిర్మాణం పట్ల కేజ్రీవాల్, ఆయన పార్టీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల పట్ల ఆప్ కానీ, పంజాబ్ ప్రభుత్వం కానీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
ఢిల్లీలో నిర్మించిన అద్దాల మేడ నుంచి కేజ్రీవాల్‌ను అక్కడ ప్రజలు తరిమేశారని, కానీ అద్దాల మేడ కాన్సెప్ట్ అనేది ఆయన మెదడు నుంచి పోలేదని, అద్దాలమేడ రెండో భాగం పంజాబ్‌లో జరుగుతున్నదని, ఆ రాష్ట్ర ప్రజల పన్నులతో దాన్ని నిర్మిస్తున్నారని, అది కూడా సీఎం కోటాలో ఆ పనులు జరుగుతున్నాయని, ఎందుకంటే పంజాబ్‌కు సూపర్ సీఎం కేజ్రీవాల్ అని షెహజాద్ పూనావాలా ఆరోపించారు. పంజాబీ పన్నుదారుల సొమ్ముతో కేజ్రీకి మేడలు కడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విస్మరిస్తోందన్నారు. పంజాబ్ మహిళలకు ప్రామిస్ చేసిన డబ్బును ఇవ్వలేదని, కానీ వీవీఐపీ భద్రతలో భాగంగా కేజ్రీవాల్ కాన్వాయ్కి మాత్రం వంద కార్లు ఏర్పాటు చేసినట్లు విమర్శించారు.
‼️ Big Breaking – आम आदमी का ढोंग करने वाले केजरीवाल ने तैयार करवाया एक और भव्य शीशमहल
दिल्ली का शीश महल ख़ाली होने के बाद पंजाब के Super CM अरविंद केजरीवाल जी ने पंजाब में दिल्ली से भी शानदार शीश महल तैयार करवा लिया है 😳
चंडीगढ़ के सेक्टर 2 में CM कोटे की 2 Acre की आलीशान 7… pic.twitter.com/d3V4W23yRw
— BJP Delhi (@BJP4Delhi) October 31, 2025
 
                            