బ్రిస్బేన్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈనెల 17 నుంచి మొదలయ్యే మూడో టెస్టు ఇంగ్లండ్‌కు జీవన్మరణ పోరాటం కాగా అంతకుముందే బెన్ స్టోక్స్ సేనకు వుడ్ దూరమవడం మరింత ఇబ్బందులకు గురిచేసేదే.
అతడి స్థానాన్ని మాథ్యూ ఫిషర్ భర్తీ చేయనున్నాడు. ఇదిలాఉండగా ఇప్పటికే రెండు టెస్టులకు దూరమైన ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. కాలి గాయంతో సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కమిన్స్ మాత్రం మూడో టెస్టు నుంచి జట్టుతో కలువనున్నాడు.