కొత్తపల్లి, డిసెంబర్ 9 : లక్నో వేదికగా ఈనెల 13 నుంచి మొదలయ్యే బీసీసీఐ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ కోసం మంగళవారం హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో ప్రకటించిన జట్టులో కరీంనగర్‌కు చెందిన యువ క్రికెటర్ కట్టా శ్రీవల్లి వైస్‌కెప్టెన్‌గా ఎంపికైంది. కెప్టెన్‌గా నిధి వ్యవహరించనుండగా, జిల్లాల నుంచి శ్రీవల్లితో పాటు అక్షయరెడ్డి హైదరాబాద్ టీమ్‌లో చోటు దక్కించుకుంది.
జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కట్టా లక్ష్మారెడ్డి, ఉమారాణి దంపతుల చిన్నకూతురు అయిన శ్రీవల్లి జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నది. కూతురు ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు చిన్నతనం నుంచి క్రికెట్లో ప్రత్యేక శిక్షణ అందించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తూ తాజాగా హైదరాబాద్ టీమ్‌కు ఎంపికైంది.