ఢిల్లీ : వచ్చే మంగళవారం (డిసెంబర్ 16న) అబుదాబి వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్-2026 వేలంలో 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొద్దిరోజుల క్రితం బీసీసీఐ ప్రకటించిన జాబితాలో 1,350 మంది వేలం కోసం తమ పేర్లను రిజిష్టర్ చేసుకోగా అందులోంచి కూడికలు, తీసివేతల తర్వాత 350 మంది మిగిలారు.
గతంలో వేలం ప్రక్రియకు నమోదుచేసుకోని డికాక్, వెల్లలాగె వంటి 35 మంది ఆటగాళ్లు కొత్తగా చేరారు. 350 మందిలో భారత్ నుంచి 16 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉండగా 224 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు.