Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
Manne Krishank | తెలంగాణ విద్యాశాఖ మంత్రి కూతురు కార్పొరేట్ స్కూల్స్ పెడితే, రెవెన్యూ, సమాచారం శాఖ మంత్రి కూతురు ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు.
Manne Krishank | సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్స్‌ను చూసి మంత్రి పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ మొదలుపెట్టిందని బీఆర్ ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పోరేట్ స్కూల్ గురించి అందరికి తెలిసిందే. రూ.2.50 లక్షలు ప్రతీ సంవత్సరం ఒక్క విద్యార్థి ఫీజు.. కొంపల్లిలో, కొల్లూరు, కోకాపేటలో రకరకాల నెట్ వర్క్ కార్పోరేట్ స్కూల్స్ నిర్మాణంలో జెట్ స్పీడులో ఉన్నాయి.. ఒక్కటంటే ఒక్క గురుకుల పాఠశాలవైపు రేవంత్ రెడ్డి పోరు.. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయితుంటే.. విద్యార్థుల పురుగుల బువ్వ తింటుంటే, విద్యార్థులు, విద్యార్థినీలు ఆస్పత్రుల పాలవుతుంటే.. రేవంత్ రెడ్డికి పట్టింపు లేదన్నారు.
మీరే నిర్మాణం చేయాల్నా.. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేయాలే.. డిఫెన్స్ చేసుకున్నవ్ నువ్విక్కడ.. మళ్లీ నీకొక్క స్కూల్ పెరుగుతుందని పొంగులేటి కూతురు కూడా స్కూల్ కంపెనీ మొదలుపెట్టింది.. జులై 2026 ఈ కంపెనీ మొదలైంది.. పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డి పొంగులేటి MAV EDU పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ పెట్టారు.. 2027 సెప్టెంబర్ నుంచి కొత్త స్కూల్ లాంచ్ అవుతుందట. ఇప్పటికే ప్రకటించేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్స్‌ను చూసి మంత్రి పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ మొదలుపెట్టింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి కూతురు కార్పొరేట్ స్కూల్స్ పెడితే, రెవెన్యూ, సమాచారం శాఖ మంత్రి కూతురు ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టింది. ఇక ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రభుత్వ సంస్థలను పక్కన పెట్టేసి వాళ్ల వాళ్ల కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణంలో పడ్డారన్నారు.
సర్కార్ దవాఖానా, సర్కార్ బడులు మాత్రం ఓపెన్ కావు..
2014 కంటే ముందు సర్కార్ దవాఖానాల్లో ఐసీయూలు పని చేస్తలేవని, బెడ్లు లేవనే పరిస్థితులుండేవి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఓపెన్ చేయలేదు, టిమ్స్ అల్వాల్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయకుండా అలానే ఉంచారన్నారు. మెడికవర్ ఆస్పత్రులు మాత్రం బ్రహ్మాండంగా ఓపెన్ అయినయి. సర్కార్ దవాఖానా, సర్కార్ బడులు మాత్రం ఓపెన్ చేయరని మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు.
కేసీఆర్‌కు పొలం ఉంటే పెద్ద నేరం లాగా చేస్తున్నారు కదా.. మరి మీ స్కూల్స్ సంగతి ఏంటి..? మీ హ్యుందాయ్ షో రూమ్స్ సంగతి ఏంటి..? మీ మెడికవర్ హాస్పిటల్ సంగతి ఏంటి..? మీ డిఫెన్స్ కంపెనీల సంగతి ఏంటి..? మీ R9 కన్‌స్ట్రక్చన్స్, మాల్స్ సంగతి ఏంటి..? వీళ్ళ వ్యాపారాలు రూ. లక్ష కోట్లు దాటిపోయాయి. తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్స్‌ను చూసి మంత్రి పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ మొదలుపెట్టింది
విద్యాశాఖ మంత్రి కూతురు కార్పొరేట్ స్కూల్స్ పెడితే, రెవెన్యూ శాఖ మంత్రి కూతురు ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టింది
MAV EDU పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ పెట్టారు
మూడు సంవత్సరాలు గడుస్తున్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఓపెన్ చేయలేదు, టిమ్స్ అల్వాల్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయకుండా అలానే ఉన్నారు
సర్కార్ దవాఖానా, సర్కార్ బడులు మాత్రం ఓపెన్ చేయరు
కేసీఆర్ కి పొలం ఉంటే పెద్ద నేరం లాగా చేస్తున్నారు కదా.. మరి మీ స్కూల్స్ సంగతి ఏంటి, మీ హ్యుందాయ్ షో రూమ్స్ సంగతి ఏంటి, మీ మెడికవర్ హాస్పిటల్ సంగతి ఏంటి, మీ డిఫెన్స్ కంపెనీల సంగతి ఏంటి, మీ R9 కన్స్ట్రక్షన్స్, మాల్స్ సంగతి ఏంటి
వీళ్ళ వ్యాపారాలు రూ. లక్ష కోట్లు దాటిపోయాయి
తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉంది
– బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2026
Read Also :
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
Spurious Liquor | మణిపూర్ కల్తీ మద్యం దుర్ఘటన.. 13కు పెరిగిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో 300 మంది..!
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు విద్యార్థి సి.హెచ్.లోహిత్ ఎంపిక
శ్రీనివాస గిరిపై సామూహిక వ్రతాలు
woman pawns mangalsutra | మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

