Manne Krishank | రాహుల్ గాంధీ అదానీ, నరేంద్రమోదీ ఫొటోలు వేసుకుంటే తప్పు లేనిది.. ఇవాళ మేము కాంగ్రెస్ హామీల గురించి నల్లచొక్కా వేసుకుంటే తప్పయిందా..? అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాన్ని మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్లో అదానీ టీ షర్ట్ వేసుకుని పోయిర్రు కదా.. హరీశ్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యే.. ఇప్పటివరకు ఓడిపోయింది లేదు.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆయనను మీరు కింద పడేస్తరు.
రేవంత్ రెడ్డి అయినా ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ సబితా ఇంద్రారెడ్డి ఏనాడు కూడా ఓడిపోలేదు. వారి జుట్టు పీకుతరు..పోలీసులు జుట్టు లాగడం చూశాం.. రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తున్నరు.. ఇందిరమ్మ పేరు పెట్టి సిగ్గు తీస్తున్నవ్ కదా రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ అంటవ్..అది బంద్ ఉంటది.. ఇందిరమ్మ చీరటలంటవ్..అవి పంపిణీ ఉండదు.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఎమ్మెల్యేల జుట్టు లాగుతరా..? సునితమ్మ చీర లాగుతరా..? అని ప్రశ్నించారు. ఇవాళ పుస్తకాల్లో చదివిన మహాభారతం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చూపెట్టిండు. కౌరవులందరు కలిసి అక్కడ మహిళలను అవమానపరిచారు. కౌరవ కాంగ్రెస్ అందరూ అక్కడ మహిళలను అవమానపరిచారన్నారు.
రాహుల్ గాంధీ అదానీ, మోడీ ఫోటోలు ఉన్న టీషర్ట్ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్తే తప్పులేదు
కానీ మా నాయకులు నల్ల దుస్తులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే తప్పు అనిపించిందా?
ఒక్క ఎన్నిక కూడా ఓడిపోని సబితా ఇంద్రారెడ్డి గారి జుట్టు లాగారు
ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మహిళలను అవమానించి,… https://t.co/Jfn3xOSfF1 pic.twitter.com/WKXlZhW5c8
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్