Manikonda Road | హైదరాబాద్ – మణికొండ లక్ష్మీ నగర్ కాలనీలో నాణ్యత లేకుండా నిర్మించడంతో.. ఒక్కరోజు కూడా క్యూరింగ్ చేయకపోవడంతో ఇప్పటికే నాలుగు సార్లు సీసీ రోడ్ కుంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మణికొండలో రోడ్డు మరోసారి కుంగిపోయింది.
లక్ష్మీనగర్ కాలనీలో నడిరోడ్డు కింద డ్రైనేజ్ వేసుకోవడానికి టీం 4 స్పేస్ అనే ప్రైవేట్ బిల్డర్‌కు మణికొండ మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 200 మీటర్లు మాత్రమే అనుమతులు ఇవ్వగా టీం4 స్పేస్ ప్రైవేట్ బిల్డర్ దాదాపు 1.5 కిలోమీటర్లు రోడ్డు తవ్వి డ్రైనేజ్ వేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో లక్ష్మీనగర్ కాలనీలో రోడ్డు ఇప్పటికే పలుమార్లు కుంగింది. దీనిపై ప్రజాపాలనలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని.. ఇది ప్రజాపాలన కాదు ఫోటోల పాలన అని కాలనీ వాసులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
టీం4 స్పేస్ బిల్డర్ వేసిన డ్రైనేజ్ లక్ష్మీనగర్ కాలనీ మధ్యలో నుండి వెళ్తుందని.. భవిష్యత్తులో డ్రైనేజ్ పొంగి కాలనీ మురుగుమయం అవుతుందని కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, టీం4 స్పేస్ బిల్డర్లపై, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
మణికొండలో మరోసారి కుంగిపోయిన రోడ్డు
లక్ష్మీనగర్ కాలనీలో నడిరోడ్డు కింద డ్రైనేజ్ వేసుకోవడానికి టీం4 స్పేస్ అనే ప్రైవేట్ బిల్డర్‌కు అనుమతులు ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ అధికారులు
కేవలం 200 మీటర్లు మాత్రమే అనుమతులు ఇవ్వగా, దాదాపు 1.5 కిలోమీటర్లు రోడ్డు తవ్వి డ్రైనేజ్ వేసిన టీం4… https://t.co/MRIL02bnYK pic.twitter.com/ER3z2WsBf6
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!