కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే కరువు
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్‌గూడలో సాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలతో ఎండిన వరి పంటలను శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రైతు గోవర్ధన్‌తో మాట్లాడారు.
- మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ఫైర్
- రంగారెడ్డి జిల్లా మల్కీజ్‌గూడలో పంట పొలాల పరిశీలన
యాచారం, అక్టోబర్ 31: కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్‌గూడలో సాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలతో ఎండిన వరి పంటలను శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రైతు గోవర్ధన్‌తో మాట్లాడారు.
అనంతరం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్తు సరఫరాపై ఆపరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. లాగ్‌బుక్‌ను పరిశీలించారు. అప్రకటిత కోతలు, లోవోల్టేజీపై విద్యుత్తు శాఖ ఏఈ సుధీర్‌ను నిలదీశారు. లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఏఈపై మండిపడ్డారు. ఇకపై వ్యవసాయానికి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

