హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి చెందాడు. మద్యం దుకాణం సిబ్బంది, వినియోగదారుడు నాగేశ్వర్రావుకు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో దుకాణం సిబ్బంది దాడి చేయగా.. నాగేశ్వర్రావు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం షేర్ మహ్మద్పేట వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.