ఈరోజుల్లో ఏదో ఒక పని చేసుకుంటేనే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చు. మూడు పూటలా తిండి తినొచ్చు. ఏదో టైమ్ పాస్ చేస్తే.. ఖాళీగా తిరిగితే ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. ముఖ్యంగా ఏ తోడూ లేని వృద్ధుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్లకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేకపోతే ఏం చేస్తారు. తమకు చేతనైన ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. లేదంటే బిచ్చం ఎత్తుకుంటారు. కానీ.. ఓ వృద్ధ మహిళ మాత్రం తనకు చేతనైన పని చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటోంది. రోడ్డు పక్కన స్ట్రాబెర్రీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.
తను చూస్తే చాలా వృద్ధురాలిగా కనిపిస్తోంది. ఎండ దంచుతోంది. తను ఎప్పుడు అవి అమ్మాలి. ఎప్పుడు ఇంటికి వెళ్లాలి. అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి చూసి మనసులో అనుకున్నాడో ఏమో.. తన దగ్గర కారు ఆపి.. స్ట్రాబెర్రీ బాక్స్ ఎంత అని అడిగాడు. ఒకటి 3 డాలర్లు అని చెప్పింది ఆ ముసలావిడ. దీంతో అన్ని స్ట్రాబెర్రీ బాక్సులు నేనే తీసుకుంటా అన్నాడు ఆ వ్యక్తి. దీంతో ఆ వృద్ధురాలు చాలా ఖుషీ అయింది. ఇవాళ నా స్ట్రాబెర్రీ బాక్సులన్నీ అమ్ముడుపోయాయి అని అనుకొని ఎంతో సంతోషిస్తుంది.
ఇంతలో ఆ వ్యక్తి తనకు మరో ట్విస్ట్ ఇస్తాడు. తన దగ్గర ఉన్న మూడు స్ట్రాబెర్రీ బాక్సులకు కలిపి ఎంత డబ్బు అవుతుందో అంతా ఇచ్చేసి.. ఆ స్ట్రాబెర్రీలను మళ్లీ నువ్వే అమ్ముకో అని చెబుతాడు. దీంతో ఆ వృద్ధ మహిళ కన్నీటి పర్యంతం అయింది. మొత్తం డబ్బు చెల్లించి.. వాటిని తీసుకోకుండా.. నువ్వు అమ్ముకో.. మరికొన్ని డబ్బులు వస్తాయి కదా అని ఆ వ్యక్తి చెప్పడం.. ఆ ఘటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి ఆ వ్యక్తిని శభాష్ అంటున్నారు. సెల్యూట్ కొడుతున్నారు. ఆ వృద్ధురాలి బాధను అర్థం చేసుకున్నావు బ్రదర్.. సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.