నల్లగొండ : ఓ వ్యక్తి నాగార్జునసాగర్ కొత్త వంతెన పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నాగార్జున రెడ్డి (50 ) మనస్తాపంతో సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.