స్త్రీ పురుషుల శరీరతత్వాలు వేరు. స్వభావాలు వేరు. పురుషులు తమ ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. ఏదైనా రుగ్మత ప్రాథమిక దశలో ఉన్నప్పుడే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏండ్లు దాటినవాళ్లు, ఏడాదికి ఒకటిరెండు సార్లు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.