Maloth Kavitha | వరంగల్ : బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలపై మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కవిత తేల్చిచెప్పారు. మహబూబాబాద్ ఎంపీ బరిలో ఉన్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి.. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని కవిత తేల్చిచెప్పారు. పార్టీ మార్పు వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు.