బెంగళూరు: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పాకిస్థాన్‌పై ప్రభుత్వం చిన్నపాటి యుద్ధం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడా అక్కడా చేస్తున్న చిన్న చిన్న యుద్ధాలతో భారత్‌పైన పాక్ పైచేయి సాధించినట్లు చెప్పుకుంటోందని ఆయన చెప్పారు.
మంగళవారం కర్ణాటకలోని విజయనగరలో సమర్పణే సంకల్ప ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తూ జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.