Mohanlal : కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు, మలయాళం సూపర్‌స్టార్ (Malayalam superstar) మోహన్‌లాల్ (Mohanlal) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) అందుకోబోతున్నారు. 2023 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
భారత సినిమా రంగానికి మోహన్‌లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికచేశామని సమాచార, ప్రసార శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. భారత సినిమా రంగంలో కొన్ని తరాలపాటు ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని కొనియాడింది. ఇండియన్ సినిమాపై ఆయన చెరగని ముద్రవేశారని కీర్తించింది.
ఈ నెల 23న అంటే వచ్చే సోమవారం ఆయన 71వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు.