KTR on Gen Z | జెన్ జెడ్ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు.. ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక
KTR on Gen Z | యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు.
KTR on Gen Z | యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను (Primordial Emotions) రెచ్చగొడుతూ, మందిర్-మజీద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోదీ గాలికొదిలేశారని విమర్శించారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని హితవుపలికారు.
శనివారం ముంబైలో జరిగిన “NDTV Yuva 2025 – The Mumbai Chapter” సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జెన్-జీ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు, ప్రభుత్వాల పాత్ర వంటి అంశాలపై తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ప్రస్తుత తరం యువత (జెన్-జీ) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని కేటీఆర్ సూచించారు. సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలన్నారు. జెన్-జీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని పాలకులను హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచిన విషయాన్ని గుర్తుచేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందన్నారు. ఇదే జెన్-జీ పవర్ అన్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత, రాజకీయాల్లోకి కూడా రావాలని కేటీఆర్ సూచించారు. “రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు, మీరే ఎందుకు రాజకీయాలను నిర్ణయించలేరు?” అని కేటీఆర్ యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా ముసలితనంలో ఉంటే భారతదేశం మాత్రం యవరక్తంతో ఉరకలెత్తుతోందన్నారు కేటీఆర్. ఈ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో చైనా, భారత ఆర్థిక వ్యవస్థలు దాదాపు సమానంగా ఉండేవన్నారు. అప్పుడు చైనా తలసరి ఆదాయం 300 డాలర్లు అయితే మనది 500 డాలర్లు. కానీ 40 ఏళ్ల తర్వాత చూస్తే, ఇండియా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకే పరిమితం అయితే, చైనా 20 ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది. ఇవాళ చైనా తలసరి ఆదాయం 13,000 డాలర్లు అయితే మనది కేవలం 2,700 డాలర్లే అన్నారు. చైనా మనల్ని ఎలా దాటిపోయిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. అమెరికా, యూరప్‌లతో చైనా పోటీపడితే, మనం మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పోల్చుకుని మురిసిపోతున్నాం” అన్నారు.
అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్, కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించిందని కేటీఆర్ గుర్తుచేశారు. 1945లో హీరోషిమా, నాగసాకిలపై అణుదాడి జరిగి లక్షలాది మంది చనిపోయినా జపాన్ కుంగిపోలేదన్నారు. ఎన్నో భౌగోళిక అననుకూలతలు ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా వాటన్నింటిని తట్టుకుని అద్భుత ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణతో నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఎదిగిందన్నారు. జపాన్ సాధించినప్పుడు భారతదేశం ఎందుకు సాధించలేకపోయిందో ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు.
గత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేటీఆర్ సోదాహరణలతో వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉంది. ప్రపంచంలోనే అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్‌లో ఉంది. కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు.
సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్ కంపెనీలకు సీఈవోలు అయితే మనం సంతోషిస్తాం కానీ, మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్. మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలన్నారు. మనదేశంలోని 38 కోట్ల జెన్-జీ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నారు. “పెట్టుబడి లేకపోవడం కాదు.. మీ ఊహాశక్తి, ఆశయాలే మిమ్మల్ని ఆపుతున్నాయంటూ” యువతలో కేటీఆర్ స్ఫూర్తి నింపారు.
ప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోందన్నారు కేటీఆర్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని (రీకాల్) చెప్పారు. బీఆర్ఎస్ను గెలిపించుకోనందుకు బాధపడుతున్నారన్నారు (రిగ్రెట్). త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉందన్నారు (రివోల్ట్).
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Gen Z
- gen z protest
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

