కుభీర్ : విద్యా బోధనలో ప్రశంసలు అందుకున్న నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కత్తి నాగోరావ్ ( Katti Nagorao) ను శనివారం గ్రామస్థులు సన్మానించారు ( Honor ) . ప్రభుత్వ పాలన దినోత్సవం సందర్భంగా ఈనెల 17న జిల్లా కేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాగోరావును జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కత్తి నాగోరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సునీత దేవిదాస్, హెచ్ఎం సుభాష్, ఆనంద్, సాయినాథ్, లక్ష్మణ్, దర్శనం దత్తు, భోజన్న, యోగేశ్వర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.