కడ్తాల్ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని మంగళవారం కోల్కత్తా హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీకి ఆలయ అర్చకులు, నిర్వాహకులు సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ నిర్వాహకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సర్పంచ్ తులసీరాంనాయక్, ఆలయ సిబ్బంది యాదగిరిస్వామి, చంద్రయ్య, దేవేందర్, బోడియనాయక్, వెంకటేశ్, కృష్ణ, శ్రీనివాస్, రాములు, రామకృష్ణ, పార్థునాయక్ పాల్గొన్నారు.