Mahesh Bigala | ఐక్యంగా దీక్షా దివస్ను నిర్వహించాలి.. బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులకు మహేశ్ బిగాల పిలుపు
Mahesh Bigala | ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, వీడియో సందేశాలు ప్రచారం చేయాలని, తెలంగాణ ప్రవాసులను భాగస్వాములను చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులను కోరారు.
Mahesh Bigala | తెలంగాణ అమరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా (21 నవంబర్ 2026) ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులతో జూమ్ ద్వారా అంతర్జాతీయ సమన్వయ సమావేశం నిర్వహించారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు. కేటీఆర్ పిలుపు మేరకు దీక్షా దివస్ సందర్భంగా సభలు, సమావేశాలతోపాటు రక్తదాన శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, వీడియో సందేశాలు ప్రచారం చేయాలని, తెలంగాణ ప్రవాసులను భాగస్వాములను చేయాలని కోరారు. అలాగే వివిధ దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం..
కేసీఆర్ నాయకత్వంలో 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాబోతోందని, తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగురవేయబోతోందని మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులకు పార్టీ నాయకత్వాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో కేటీఆర్ దేశాల పర్యటనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులందరూ ఐక్యంగా పనిచేస్తూ దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాలి… అమరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలవాలని ఆకాంక్షించారు.

Brs Nris

Brs Nris1
Read Also :
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | ఐక్యంగా దీక్షా దివస్ను నిర్వహించాలి.. బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులకు మహేశ్ బిగాల పిలుపు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

