Maha Shivaratri | ఆదిలాబాద్/నిర్మల్ నెట్వర్క్ ;మహాశివరాత్రి వేడుకలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో ఆలయాలన్నీ కాంతులీనుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, అధికారులు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆయా చోట్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు స్వచ్ఛందసంస్థలు ముందుకు వచ్చాయి. శివకల్యాణంతో పాటు ఇతర పూజలు జరుగనుండగా, శివనామస్మరణతో ప్రాంగణాలు మార్మోగనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ పట్టణంలోని పురాతన కుమార్ పేట్ గంగపుత్ర శివాలయం, శ్రీరాం కాలనీ, సంజయ్‌నగర్, రాంనగర్‌లోని శివాలయాలు, రవీంద్రనగర్‌లోని ఉమామహేశ్వర ఆలయం, ఆదిలాబాద్ మండలంలోని శివఘాట్-కుంభజరి శివారులోని కోటి లింగాల, అనుకుంట శివాలయం, ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయం, బోథ్‌లోని శివభక్త మార్కండేయాలయం, నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వద్ద రాతి గుహలో ఉన్న సోమేశ్వరాలయం, ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి, సిరికొండ మండలంలోని కొండాపూర్ శివాలయం, ఉట్నూర్ మండంలోని సాలెవాడ(కే) శివాలయం, బేల మండలంలోని ఖాదీ గ్రామ శివారులోని నందీశ్వరాలయం.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ పట్టణంలోని నగరేశ్వర వాడ శివాలయం, వెంకటాద్రి పేట్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయం, వెంకటాపూర్ కాలనీలోని మహదేవ ఆలయం, గండిరామన్న దత్తసాయి కొండ శివాలయం, సారంగాపూర్ మండలంలోని యాకర్పెల్లి శ్రీ బసవేశ్వర దేవాలయం, చించోలి(బి)లోని దుబ్బరాజేశుడు, ఆలూర్,ధనిలో రాజరాజేశ్వర, వంజర్లో శివాలయం, వైకుంఠాపూర్లో ప్రభు స్వామి దేవాలయాలు, మామడ మండలంలోని బూరుగుపెల్లి శివాలయం, భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి మహాదేవ్ మందిరం, చెరువు కట్ట, భట్టిగల్లి , సాయిబాబా గుట్టపైన ఉన్న శివాలయాలు, ఖానాపూర్ పట్టణంలోని గంగాగౌరి ఆలయం, శ్రీరామ్‌నగర్‌లోని మహాదేవ అన్నపూర్ణ ఆలయం, సాయినగర్‌లోని శ్రీ భక్త మార్కండేయ ఈశ్వరాలయం, ఖానాపూర్ మండలం తర్లపాడు, రంగపేట్, దిలావర్పూర్లలోని రాజరాజేశ్వర ఆలయాలు, పాత ఎల్లాపూర్లోని అన్నపూర్ణ మహాదేవ ఆలయాలు, కడెం మండలంలోని లింగాపూర్, ఎలగడప గ్రామాల్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, అంగడీశ్వర ఆలయాలు. పెంబి మండలంలోని ఇటిక్యాల శివాలయం, కుభీర్ మండలంలోని పార్డీ(బీ) గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయం, సోన్ మండలం సిద్ధులకుంట గ్రామంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం, దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం, నిర్మల్ పట్టణం వెంకటాద్రిపేట్లోని పురాతన శివాలయం, లక్ష్మణచాంద మండలం బాబాపూర్ రాజరాజేశ్వర స్వామి ఆలయం, దిలావర్పూర్ మండలంలోని శ్రీ కదిలి పాపహరేశ్వర, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు.