దేవరుప్పుల/ పాలకుర్తి రూరల్, మార్చి 4 : మన ఊరు- మన బడితో సర్కారు స్కూళ్లకు మహర్దశ పట్టనుందని, ఢిల్లీ తరహా విద్యావ్యవస్థ అందుబాటులోకి రానుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ‘మన ఊరు – మన బ డి’లో భాగంగా దేవరుప్పుల మండలం చినమడూరు ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం ని ర్వహించారు. పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ పనులపై దేవాదుల అధికారులతో సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడు తూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయని, పేద విద్యార్థుల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే రోజులు వస్తాయన్నారు. చినమడూరు పాఠశాల అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయిస్తామన్నారు. మరోవైపు జవాబుదారీతనం ఉండేందుకు గ్రామస్తుల తోడ్పాటు అవసరమని, దాతలు ముందు కొచ్చి పాఠశాలలకు విరాళాలు ఇవ్వాలని కోరారు. పాఠశాలకు ఏం కావాలో చెప్పాలని విద్యార్థులను కోరగా, పదో తరగతి విద్యార్థి జనగామ కావ్య తమ పాఠశాలకు మంచి టీచింగ్ స్టాఫ్, డైనింగ్‌హాల్, తాగునీటి వసతి, వాష్‌రూం కావాలని కోరింది.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో పా లకుర్తి నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం శ్రమించాలని మం త్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడని, దే వాదుల ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకి తం చేసిన మహాత్ముడని కొనియాడారు. పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నష్కల్ 4ఎల్, చెన్నూ రు, నవాబుపేట రిజర్వాయర్లతో నియోజకవర్గంలో 80వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతున్నారు.