ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొత్తగా 10,428 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,73,261కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 56,652కు పెరిగింది.