ఆక్సిజన్ మాస్కుతో రోగి ధర్నా.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు
కరోనా రోగి | ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

ముంబై : ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ర్టలోని నాసిక్‌లో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 38 ఏళ్ల వయసున్న బాబాసాహెబ్ కోలేకు గత మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బైట్కో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని చేర్చుకోలేదు. అక్కడ్నుంచి మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కూడా చేర్చుకోకపోవడంతో.. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లాడు.
అక్కడ బెడ్ లేదని చెప్పడంతో మరికొన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగి, చివరకు మరో గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ ఆక్సిజన్ మాస్కు పెట్టినప్పటికీ వైద్యులు పట్టించుకోలేదు. దీంతో ఆ రోగి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. రోగి నిరసనపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతని ఆక్సిజన్ లెవల్స్ 40 శాతానికి పడిపోయాయి. చివరకు ఆస్పత్రిలోనే బాబాసాహెబ్ కోలే ప్రాణాలు కోల్పోయాడు.
ఇవి కూడా చదవండి..
15 రోజుల కవలలకు కరోనా పాజిటివ్
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
కౌటిల్యంపై చాణక్య విజయం
హైదరాబాద్ లో ఇండ్లకు భలే గిరాకీ
సిటీ చుట్టూ రియల్ బూమ్
చిన్నారి ఊపిరి తీసిన ఊయల
అమ్మా నన్ను ఎందుకు వదిలి వెళ్లావ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

