హైదరాబాద్ లో ఇండ్లకు భలే గిరాకీ
హైదరాబాద్ | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశానికే వెలుగురేఖలా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయన్న అనుమానాలను పటాపంచలు

- నివాస గృహాల ధరల పెరుగుదలలో దేశంలోనే హైదరాబాద్ నంబర్ 1
- ప్రపంచ నగరాల్లో 122వ స్థానంలో భాగ్యనగరం
- నైట్‌ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌లో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశానికే వెలుగురేఖలా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రగతి పథాన శరవేగంగా దూసుకుపోతున్నది. నివాస గృహాల వార్షిక ధరల పెరుగుదలలో హైదరాబాద్ దేశంలో నంబర్ వన్‌గా ఉన్నదని ప్రాపర్టీ దిగ్గజ సంస్థ నైట్‌ఫ్రాంక్ ప్రకటించింది. 2020 నాలుగో త్రైమాసికంలో నైట్‌ఫ్రాంక్ నిర్వహించిన గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌లో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే 122వ స్థానంలో నిలువటం విశేషం.
ఆగని పరుగు
కరోనా కారణంగా ప్రపంచవ్యాపారం మొత్తం కుదేలైనా హైదరాబాద్ పరుగు ఏమాత్రం తగ్గలేదు. నగరంలో డిమాండ్ పెరుగుతుండటంతో నివాస గృహాల ధరలు పైపైకి పోతూనే ఉన్నాయి. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నగరంలో నివాస గృహాల ధరలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 0.2 శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. ధరల పెరుగుదలలో హైదరాబాద్ నగరం దేశంలో మొదటిస్థానం, ప్రపంచంలో 122వ స్థానంలో నిలిచినట్టు నైట్‌ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌లో తేలింది.
హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగళూరు (129), అహ్మదాబాద్ (143), ముంబై (144), ఢిల్లీ (146), కోల్‌కతా (147), పుణె (148), చెన్నై (150) ఉన్నాయని వెల్లడించింది. బెంగళూరులో ధరలు 0.8 శాతం పడిపోగా, అహ్మదాబాద్ 3.1, ముంబై 3.2, ఢిల్లీ 3.9, కోల్‌కతా 4.3, పుణె 5.3, చెన్నైలో 9 శాతం చొప్పున దిగజారాయి. ఈ ఇండెక్స్‌లో అంకారా (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇండ్ల ధరలు 30.2 శాతం ఎగబాకాయి. తర్వాతి రెండు స్థానాల్లోనూ టర్కీ నగరాలే ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాలతో ఈ జాబితాను నైట్ ఫ్రాంక్ రూపొందించింది.
హైదరాబాద్‌లో స్థిరమైన వృద్ధి
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లోనూ స్థిరమైన వృద్ధిని ప్రదర్శిస్తుండటం విశేషం. అందువల్లే గతేడాది ప్రతీ త్రైమాసికంలోనూ ఇండ్ల ధరల్లో పెరుగుదల నమోదైంది. నగరంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు బలంగా విస్తరించాయి. ఈ కంపెనీల్లో పనిచేసే నిపుణుల నుంచి ఇండ్లకు భారీగా డిమాండ్ వ్యక్తమవుతున్నది.
– శిశిర్ బైజల్, నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

