House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న ఒక ఇంటికి స్లాబ్ వేస్తుండగా అది కూలిపోయింది. ఆ సమయంలో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఒక కూలీ మరణించగా మరో నలుగురు గాయపడ్డారు.
లక్నో: నిర్మాణంలో ఉన్న ఒక ఇంటికి స్లాబ్ వేస్తుండగా అది కూలిపోయింది. ఆ సమయంలో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఒక కూలీ మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. (House Slab Collapses) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోదీనగర్‌లోని సిక్రి గ్రామంలో ఒక ఇంటిని నిర్మిస్తున్నారు. శనివారం కాంక్రీట్ స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురు కార్మికులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించగా ఒక కార్మికుడు మరణించాడు. మిగతా నలుగురు చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

