NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
NZvIND: కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం భారత జట్టు 4 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్‌లో ఇండియా జట్టు 2-0 ఆధిక్యాన్ని పొందింది. నాలుగు వికెట్లు తీసిన బ్రార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే(NZvIND)లో ఇండియా 4 రన్స్ తేడాతో గెలుపొందింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్‌ను గెలిచింది. ఆట నిలిచే సమయానికి ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 113 రన్స్ చేసింది. వాస్తవానికి వర్షం వల్ల మ్యాచ్‌ను కుదిరించారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వర్షం ఆటను అడ్డుకునే సమయానికి ఇండియా నిర్దేశిత లక్ష్యం కన్నా మూడు రన్స్ అధికంగానే ఉన్నది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా జట్టు విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ విక్టరీతో 5 వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యాన్ని సాధించింది. వాతావరణం బౌలర్లకు అనుకూలంగా ఉన్నా.. దురదృష్టవశాత్తు న్యూజిలాండ్ విజయాన్ని అందుకోలేకపోయింది. కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన గుర్నూర్ బ్రార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 41 ఓవర్లలో 134 రన్స్‌కే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ 55 రన్స్, సాంట్నర్ 31 రన్స్ చేశారు.అక్షర్, కాంబోజ్, నబీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. లక్ష్యం స్వల్పమే అయినా.. భారత్ కూడా వెల్లింగ్టన్ పిచ్‌పై తడబడింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 23, శ్రేయాస్ అయ్యర్ 30 రన్స్ చేశారు. ఇక కేఎల్ రాహుల్ 26 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జేమీసన్, డఫీలు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

