ధర్నాను జయప్రదం చేయాలి

టీఆర్ఎస్ నేతల పిలుపు
ధన్వాడ, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ధన్వాడ, మరికల్ మండలాల ఇన్చార్జి రాజవర్ధన్‌రెడ్డి కోరారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నాయకత్వంలో ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, విండో వైస్ చైర్మన్ గండి బాల్‌రాజ్, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, యువజన విభాగం అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, సచిన్, వీరేశ్కుమార్తోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికసంఖ్యలో పాల్గొనాలి
కృష్ణ, నవంబర్ 11 : రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించే ధర్నాలో మండల కేంద్రం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌పాటిల్ గురువారం ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విజయవంతం చేయాలి
మక్తల్ టౌన్, నవంంబర్ 11: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ ఆదేశాల ప్రకారం ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి గురువారం ప్రకటన లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిర సనగా టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రైతు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుధర్నాను విజవంతం చేయాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

