స్వయం ఉపాధిలో రాణించాలి

- జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
- కుట్టు శిక్షణాకేంద్రం ప్రారంభం
జడ్చర్లటౌన్, నవంబర్ 11 : మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని లయన్స్ క్లబ్ భవనంలో మన సేవాసమితి, లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుట్టుశిక్షణలో నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి జీవనోపాధి కల్పించాలని తెలిపారు. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు స్వయం ఉపాధి ఎంతో దోహదం చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, లయన్స్ క్లబ్ జోనల్ అధ్యక్షుడు ప్రవీణ్, అధ్యక్షుడు సుదర్శన్, బాద్మి రవిశంకర్, యాదయ్య, మెడిశెట్టి రామకృష్ణ, మురళి, మన సేవాసమితి అధ్యక్షుడు వేణు, రవీందర్‌రెడ్డి, రఘు, రాధాకృష్ణ, బాలమణి, టీఆర్ఎస్ నా యకులు సతీశ్, శ్రీకాంత్, ఇంతియాజ్, రమేశ్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్నాను విజయవంతం చేయాలి
జడ్చర్ల, నవంబర్ 11 : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ధర్నాకు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, రైతులు తరలిరావాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

