World’s Best Cities | లండన్ : వరల్డ్ బెస్ట్ సిటీస్-2025లో ‘లండన్ నగరం’ టాప్‌లో నిలిచింది. లండన్ తర్వాత న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్.. టాప్-10లో ఉన్నాయి. నివాస యోగ్యత, సంస్కృతి, నగరంలో రాత్రి జీవితం మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఉత్తమ నగరాల ఎంపిక జరిగిందని ర్యాంకింగ్స్ విడుదల చేసిన ‘రిసోనెన్స్ కన్సల్టెన్సీ’ తెలిపింది.
కాగా టాప్-100 సిటీస్‌లో భారతీయ నగరాలేవీ లేకపోవటం గమనార్హం. ముంబై, ఢిల్లీ నగరాలకు కూడా ర్యాంకింగ్స్‌లో చోటు దక్కలేదు. ‘31 దేశాల్లో 22వేల మందిని సర్వే చేశాం. నివాస యోగ్యమైనవిగా ముంబై, ఢిల్లీ నగరాలకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. కానీ ప్రపంచ స్థాయిలో ఈ నగరాలు టాప్-100లో లేవు’ అని ‘రిసోనెన్స్ కన్సల్టెన్సీ’ అధ్యక్షుడు, సీఈవో క్రిస్ ఫెయిర్ అన్నారు.