T20 World Cup : పొట్టి వరల్డ్ కప్ సంగ్రామానికి మరో కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) 9వ సీజన్ అమెరికా గడ్డపై ఆరంభం కానంది. ఫార్మాట్ పేరుకు తగ్గట్టే ఈసారి టైటిల్ వేటలో 20 జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వామప్ మ్యాచ్‌లతో జట్టు కూర్పుపై ఓ అంచానాకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా(USA), వెస్టిండీస్(West Indies) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీలో రికార్డులు బద్దలు కొట్టేది ఎవరు? వికెట్ల వీరుడిగా నిలిచేది ఎవరు? అనే చర్చలు జోరుందుకున్నాయి.
గత సీజన్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన బ్యాటర్లు మళ్లీ పరుగుల వరద పారించేందుకు రెడీ అయ్యారు. మరోవైపు బౌలర్లు సైతం వికెట్ల వేటకు కాచుకొని ఉన్నారు. గత 9 సీజన్లలో బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపింది ఎవరంటే.?
ఐసీసీ 2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా అవతరింది. ఆ ఎడిషన్‌లో పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది(Shaheed Afridi) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎంపికయ్యాడు. 2009లో తిలకరత్నే దిల్షాన్(శ్రీలంక), 2010 వరల్డ్ కప్‌లో కెవిన్ పీటర్సన్(ఇంగ్లండ్) ఈ అవార్డును అందుకున్నారు.
Who will add their name to the Men’s #T20WorldCup honour roll in 2024? 🎖 pic.twitter.com/MerxkIzIG8
— ICC (@ICC) May 31, 2024
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 2012లో విజేతగా నిలవగా.. 2014, 2016లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) టాప్ స్కోర్‌తో రికార్డు నెలకొల్పాడు. 2021లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. 2022లో సామ్ కరన్‌లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును తన్నుకుపోయారు.
తొలి ఎడిషన్‌లో పాక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నా.. ఆ జట్టు స్పీడ్‌స్టర్ ఉమర్ గుల్(Umar Gul) నిప్పులు చెరిగాడు. 13 వికెట్లు తీసిన గుల్ 2009లోనూ బెంబేలెత్తించాడు. ఈసారి ఈ పేసర్ మళ్లీ 13 వికెట్లతో మెరిశాడు. 2010 ఎడిషన్‌లో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ నాన్సీ డిర్క్ నేన్స్ 14 వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. ఇక 2012 వరల్డ్ కప్‌లో అయితే.. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్(Ajanta Mendis) 15 వికెట్లతో చరిత్ర సృష్టించాడు.
Could Wanindu Hasaranga finish as top wicket-taker again? #T20WorldCup pic.twitter.com/iUDto2PK6j
— ESPNcricinfo (@ESPNcricinfo) May 31, 2024
అనంతరం జరిగిన 2014 ఎడిషన్‌లో సఫారీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, అహసన్ మాలిక్‌లు 12 వికెట్లతో టాప్‌లో నిలిచారు. అఫ్గనిస్థాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ 2016లో 12 వికెట్లతో విజృంభించాడు. 2021, 2022 ఎడిషన్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) తిప్పేశాడు. రెండు సీజన్లలో 16, 15 వికెట్లు పడగొట్టాడు. మరి ఈసారి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేది ఎవరో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.